కన్నతల్లికి రెండేళ్లుగా నరకం

by Kalyani |
కన్నతల్లికి రెండేళ్లుగా నరకం
X

దిశ గద్వాల రూరల్ : నవమాసాలు మోసి కని పెంచి, విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుడిని చేసిన తల్లికి ప్రతిఫలంగా చార్టెడ్ అకౌంటెంట్ రెండేళ్లుగా గృహ నిర్బంధం విధించి నరకయాతన చూపిస్తున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వృద్ధురాలు పేరు రత్నమ్మ, ఆమెకు 75 సంవత్సరాలు. సంతానం ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ముందు నుంచి ఆ కుటుంబం స్థితిగతులు ఆర్థికంగా ఉన్న కుటుంబం. అయితే కొడుకు చంద్రశేఖర్ చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నా ఆస్తి తనపై చేయాలని ఒత్తిడి చేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి గద్వాలలోని బురద పేటలో ఏర్పాటు చేసిన బందిఖానాలో తన తల్లి రత్నమ్మను ఉంచాడు.

ముందుగా ఒక మగ సంతానం కాగా ఇద్దరు కూతుళ్లు. వారికి వివాహం కాగా. అందులో ఒక ఆమె చనిపోయారు. చాలా సంవత్సరాల క్రితం రత్నమ్మ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ ఆస్తి అంతా రత్నమ్మ పేరు పైననే ఉంది. దీంతో తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి తనకు మార్పిడి చేయాలంటూ గత రెండు సంవత్సరాలుగా విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తూ, ఎవరితో మాట్లాడకుండా,ఎవరికీ కనిపించకుండా, ఒక చిన్న రూమ్ లో బంధించాడు. ఆయనేమో బిల్డింగ్ లో ఉంటూ విలాసంతవైన జీవితం గడుపుతున్నారు. మరోవైపు కన్నతల్లిని రెండు సంవత్సరాలుగా బందీగా ఉంచి తన పేరుపై ఆస్తి ఎక్కియాలని తల్లిని దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.

తల్లి అలా చేయకపోవడంతో కొడుకు రూపంలో కష్టాలు మొదలయ్యాయి. సొంత కూతురు తో మాట్లాడకుండా, చూడరాదనే నిబంధన పెట్టి గేటుకు తాళం వేశారు. రోజుకు ఒక పూట అన్నం పెట్టి పొద్దస్తమానం ఖాళీ కడుపుతో ఉండాలని ఆమె కొడుకు కండీషన్ పెట్టాడు. నా పేరు మీద ఉన్న ఆస్తి నా కొడుకుకి ఇచ్చేదాకా నాకు ఇదే పరిస్థితి అని, ఇది తన కొడుకు విధించిన శిక్ష అని ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె కిందపడి ఒక కాలు విరిగిపోయింది. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని అన్నీ కూడా కూర్చున్న చోటనే పోతున్నానని తనను కాపాడాలని ఆమె మొరపెట్టుకుంది. తన కూతురు పోలీసులను సంప్రదించారు. తమ తల్లిని తమకైన ఇప్పించండి తమ బాగోగులు చూసుకుంటామని డీఎస్పీ సత్యనారాయణని సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గద్వాల్ టౌన్ ఎస్సై కు ఫిర్యాదు ప్రతిని, బాధితులను పంపి కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed