- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా బండ లాగుడు పోటీలు
పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి
దిశ, కొల్లాపూర్: పాన్ గల్ మండల పరిధిలోని రేమద్దులలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శివశంకర హమాలీ సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న వృషభ రాజుల బండ లాగుడు పోటీలను ఆదివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మొదట ఆయన రామలింగేశ్వర ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా పోటీల్లో పాల్గొని విజయం సాధించిన మొదటి విజేతకు సొంత ఖర్చులతో రూ.60వేలు బహుమతిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎడ్ల పందాలు, బండ లాగుడు పోటీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సంప్రదాయానికి అద్దం పడుతాయని పేర్కొన్నారు అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు, ప్రజల్లో కొత్త వెలుగులు వచ్చాయని పేర్కొన్నా. కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.