అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది: MLA Guvvala Balaraju

by Mahesh |   ( Updated:2022-12-11 09:02:05.0  )
అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది: MLA Guvvala Balaraju
X

దిశ, వంగూర్: అన్ని వర్గాల ప్రజలకు అండగా, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు పోతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్న 100 మంది నాయకులు, కార్యకర్తల చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. తదుపరి వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొనసాగుతుంటే కాళ్ళలో కట్టెలు పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒక పక్క కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ ప్రజలను గందరగోళం చేస్తున్న బీజేపీ పార్టీకి నూకలు చెల్లెల దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈడి అని, సీబీఐ అని విచారణ పేరుతో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

గ్రామంలో అభివృద్ధి కోసం అన్ని రకాల కృషి చేస్తానని తెలియజేశారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణానికి 5,00,000/- లక్షల రూపాయల నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం కొరకు పెద్ద మొత్తంలో మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు కూడా ఖాళీ స్థలం ఉన్న వారికి 3 లక్షలు ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేస్తూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు కూడా ఇండ్లు ఇప్పించడం జరుగుతుందని అందుకు పార్టీ ప్రజాప్రతినిధులు, పెద్దలు, అధికారులతో సమన్వయం అయి గుర్తించాలని వారు కోరారు.

అదేవిధంగా తెలంగాణలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ దళితుల ఆర్థిక పరిపుష్టతకై కృషి చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. అందుకు రెండో విడత కింద వచ్చే దళిత బంధు యూనిట్ల విషయంలో కూడా నిజాంబాద్ గ్రామానికి ఎక్కువ ఇవ్వడంలో కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈడిల పేరుతో పీడిస్తున్న బిజెపిని ఓడించడం కోసం దేశంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా సీఎం కేసీఆర్ ఆవిర్భవించడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అందుకు ప్రజలు కూడా మరోసారి టీఆర్ఎస్ పార్టీ అచ్చంపేటలో గెలిపించడం కోసం స్వచ్ఛందంగా తరలి వచ్చి పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు. నిజాంబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ పద్మ, చంద్రమౌళి తో పాటు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో చేరిన వారందరికీ గులాబీ కండువాలతో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మొదటి కుమారుడు హ్రిద్దిక్ పుట్టినరోజు సందర్భంగా గ్రామస్తులు అభిమానంతో కేక్ తెచ్చి ఎమ్మెల్యే చేతులమీదుగా గ్రామస్తుల, చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ పద్మ, చంద్రమౌళి, బాలస్వామి, చిన్న మాసయ్య, వెంకట్ రాములు, రాంచందర్, పెద్ద సాయిలు, ఎర్ర రాయిలు, జానయ్య, చిన్న జానయ్య, భారతమ్మ, సుగుణమ్మ, నర్సమ్మ, తారమ్మ, బాల్ రాములమ్మ, సూర్య కళ, లాలమ్మ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలస్వామి, టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు అమీద్, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, స్థానిక గ్రామ వాసి అంకూరి డాక్టర్ కృష్ణ, సర్పంచుల సంఘం మండల అద్యక్షులు ఆంజనేయులు, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్, నర్సిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ఆనంద్ రెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, నారాయణ రావు, తవిటి నాగేష్, సురేష్, నిరంజన్, నిజాముద్దీన్, శ్రీరాములు, శ్రీశైలం, మల్లేష్, ఆంజనేయులు, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed