ఈనెల 15న రాస్తారోకో

by S Gopi |
ఈనెల 15న రాస్తారోకో
X

దిశ, మహబూబ్ నగర్: ఆర్టీసీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఈపీఎస్ పెన్షన్ దారుల కనీస పెంపుకై ఉద్యమమే శరణ్యమని జాతీయ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎ. రాజసింహుడు అన్నారు. స్థానిక పారిశ్రామిక వాడలో బుధవారం జరిగిన ఈపీఎస్ పెన్షనర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కాకుండా ఈపీఎఫ్ఓ పేరా నెంబర్ 26(6) నిబంధనలు పెట్టి సభ్యులను అయోమయానికి గురి చేస్తుందని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఇంతవరకు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లే తెరుచుకోవడంలేదని ఆయన ఆరోపించారు. పెన్షన్ దారులకు అధిక పెన్షన్ పొందకూడదనే లేని నిబంధనలను పెట్టి అనర్హతకు గురి చేస్తుందని ఆయన ఆరోపించారు. నిబంధనలు లేకుండా అందరికీ కనీస పెన్షన్ కరువు భత్యంతో 7500 రూపాయలకు పెంచాలని, పెన్షనర్ల భార్యాభర్తలకు ఉచిత వైద్యసౌఖర్యాలు కల్పించాలనే జాతీయ సంఘర్షణ సమితి డిమాండ్లే సరియైనవని ఆయన అన్నారు. జాతీయ సంఘర్షణ సమితి పిలుపు మేరకు ఈనెల 15న రాస్తారోకో కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్ధుల్ కరీం, చంద్రశేఖర్ రావు, కొండయ్య, నారాయణ, భగవంతు, బీహెచ్ కుమార్, ఉమేష్ కుమార్, సంజీవరెడ్డి, యాదయ్య, వేమారెడ్డి, ఆర్టీసీ, గృహనిర్మాణ, డీసీసీబీ, పాడిపరిశ్రాభివృద్ధి తదితర విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story