పదవ తరగతి నుంచే భవిష్యత్తుకు పునాది

by Naveena |
పదవ తరగతి నుంచే భవిష్యత్తుకు పునాది
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కొత్త చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి,చెరువులోకి చేపలను వదిలి,మత్స్యకారులకు ఉచితంగా చేపలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల వృత్తి ఒక్కటే ప్రధానం కాదని,తమ బిడ్డలకు మంచి చదువులు చదివించి ఉన్నత పదవులను అలంకరించి,పది మందికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ..విద్య,ఉపాధి మీద దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు సంఘం జిల్లా అధ్యక్షుడు గంజి ఆంజనేయులు,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నర్సింహారెడ్డి,మోహన్ రెడ్డి,రామకృష్ణ,ఫయాస్,మోయిస్,ప్రవీణ్,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి నుంచే భవిష్యత్తుకు పునాది....

పదవ తరగతి నుంచే పిల్లల భవిష్యత్తుకు పునాది పడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని కోడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ ను,పెన్ డ్రైవ్ లను శుక్రవారం లోగా అందిస్తానని,ఆ పెన్ డ్రైవ్ లను ఉపయోగించి డిజిటల్ తరగతులను విద్యార్థులకు బోధించాలని ఆయన సూచించారు. పాఠశాల హెడ్ మిసేస్ వెంకటేశ్వరమ్మ,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story