కూతురు కనిపించడం లేదు.. వాడి మీదే అనుమానం ఉంది సారూ..

by Naveena |
కూతురు కనిపించడం లేదు.. వాడి మీదే అనుమానం ఉంది సారూ..
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పొట్టయ్యగారి లావణ్య (19) అనే యువతి అదృశ్యమైంది. ఈ నెల 29వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందని ఆమె తల్లి మంగమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన తన మూడవ కూతురు లావణ్య మహబూబ్ నగర్ లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. తన రెండవ కూతురు అనితకు ఆరోగ్యం బాగా లేనందున ఈనెల 29వ తేదీన ఇంటి వద్ద లావణ్యను ఒంటరిగా వదిలేసి అనితను వెంట తీసుకుని మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి వచ్చి చూసేసరికి లావణ్య ఇంట్లో కనిపించలేదని మంగమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కోసం తమ బంధుమిత్రుల వద్ద ఎంతగానో వెతికినా కూడా ఆచూకీ లభించలేదని ఆమె తెలిపారు. తన కూతురు అదృశ్యానికి గ్రామానికి చెందిన ఎల్లరి నరేష్ అనే యువకుడిపై అనుమానం ఉందని అమె తెలిపారు. ఈ విషయమై యువతి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed