- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పదంగా ప్రభుత్వ ఉద్యోగి మృతి
దిశ, పిట్లం : పెద్ద కొడంగల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం ఎల్లయ్య బుధవారం రాత్రి పిట్లం మండల కేంద్రంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న 2వంతస్తుపై అనుమానస్పదంగా మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లయ్య ఉపాధ్యాయుడు కాటేపల్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. మండల కేంద్రంలో పడిగెల నందు ఆ ఈయన బిల్డింగ్ లో రెండవ అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి యజమాని బిల్డింగును రిపేరు నిమిత్తం సేఫ్టీ రాడ్స్ లేకపోవడంతో రాత్రి సమయంలో కాలకృత్యాలకు బయటకు వచ్చిన వ్యక్తి రెండో అంతస్తు పై నుండి కిందికి పడిపోవడంతో అక్కడి అక్కడే మృతి చెందాడని కుటుంబీకులకు తెలిపారు.
ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన కూతురికి సమాచారం ఇవ్వగా కూతురు వచ్చిన తర్వాత వెళ్లినట్లు పోలీసులు తెలుపుతున్నారు. కానీ అర్ధరాత్రి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంలో మతలబు ఏంటని సిద్ధాపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అన్నదమ్ములకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శవాన్ని తరలించడం ఎంతవరకు సమంజసం అని పోలీసులను ప్రశ్నిస్తున్నారు.