- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పర్యావరణ పరిరక్షణ,వన్య ప్రాణుల సంరక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ప్రజా విజయోత్సవాలలో భాగంగా బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో.. పట్టణంలోని మయూరి ఎకో పార్క్ లో నిర్వహించిన 'వనదర్శిని,స్నేక్ షో' కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథి గా పాల్గొని ప్రారంభించి ప్రసంగించారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలు సందర్శించి విజ్ఞానం పెంపొందించుకోవాలనే ధ్యేయంతో పాఠశాలల్లో యువ టూరిజం క్లబ్ లు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ అండ్ పిజి.కళాశాల వృక్ష శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సదాశివయ్య స్నేక్ షో నిర్వహించారు. ముఖ్యంగా పాములు ఎన్ని రకాలు,విష సర్పాలు,విష రహిత సర్పాలు,వాటి ఆహారం,పాము కాటు వేస్తే లక్షణాలు,పాములతో పర్యావరణ సమతుల్యత వంటి అంశాలపై అవగాహన కలిగించి..పాములతో లైవ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సత్యనారాయణ,డిపిఆర్ఓ శ్రీనివాస్,ప్లయింగ్ స్క్వాడ్,అటవీ అధికారి రాంమోహన్,రెడ్ క్రాస్ చైర్మెన్ నటరాజ్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా తదితరులు పాల్గొన్నారు.అనంతరం
పాఠశాలల్లో నిర్వహించిన వ్యాస రచన,వకృత్త్వం,డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన వారికి మెమెంటో లు అందజేశారు.