దాబాలలో అక్రమ మద్యం సిట్టింగులు నడిపిస్తే కఠిన చర్యలు.. అదనపు ఎస్పీ

by Sumithra |
దాబాలలో అక్రమ మద్యం సిట్టింగులు నడిపిస్తే కఠిన చర్యలు.. అదనపు ఎస్పీ
X

దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 167 పై మరికల్ నుండి కృష్ణ బోర్డర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న దాబాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాబాలలో అక్రమ మద్యం సిటింగ్లు నడిపిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దాబాల యజమానులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శుక్రవారం అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీ కె.సత్యనారాయణ నారాయణపేట జిల్లా, మక్తల్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 167పై మరికల్ నుండి కృష్ణ బోర్డర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న దాబాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దాబాల్లో అక్రమ మద్యం సిటింగుల్లో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని. ప్రమాదాల నివారణచర్యల్లో రోడ్డుకు ఇరువైపులా దాబాలను ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. ప్రమాదాల నివారణ కై జాతీయ రహదారికి కలిపే రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్, వైట్ పెయింట్ మలుపుల దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నియంత్రణకు మించి వేగం దాటితే స్పీడ్ గన్తొ చలాన్స్ విధిస్తామని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. తనిఖిలో కృష్ణ ఎస్సై విజయ్ భాస్కర్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed