- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: జర్నలిస్టులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సమాచార పౌర సంబంధాల, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గతంలో జిల్లాలో 1,194 మంది జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వగా, నేటికి 1,895 మందికి గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చనిపోయిన 18 మంది జర్నలిస్టు కుటుంబాలకు 18 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని, అనారోగ్యం పాలైన 8 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున మీడియా అకాడమీ ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేసి ఆదుకున్నామని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 మంది జర్నలిస్టులకు పెన్షన్ లను అందజేస్తున్నామని, త్వరలోనే జర్నలిస్టులందరికీ ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మూడా చైర్మెన్ గంజి వెంకన్న, లక్ష్మీ, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, సూపరిటెండెంట్ డా. రాంకిషన్, డీఎం అండ్ ఎచ్ఓ డాక్టర్ కృష్ణ, డా.భాస్కర్, ఆర్ఎంఓ లక్ష్మణ్, డా.జీవన్, డా.శశికాంత్, డా.సంధ్య, సృజన తదితరులు పాల్గొన్నారు.