- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం.. జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్
దిశ, గద్వాల క్రైమ్: భారత రాజ్యాంగ నిర్మాణంలో డా.బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం అని జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం పొందిన మరో రెండేళ్ల కాలం తర్వాత రాజ్యాంగ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి ఎంతోమంది మేధావుల కృషి ఉందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 న ఆమోదం పొందిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం విధుల పట్ల అంకిభావంతో, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని సిబ్బంది అందరిచేత ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శివకుమార్, డీసీ ఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీసీ లోహిత్ కుమార్, సుపరెండెoట్స్, ఐటీ సెల్ సిబ్బంది, డీసీ ఆర్బి సిబ్బంది, ఎస్బి సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.