- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది సోనియాగాంధీ.. డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి
దిశ, నారాయణపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చిందని డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి లు అన్నారు. దశాబ్ది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిట్టెం.నర్సిరెడ్డి చౌరస్తాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లిగా తెలంగాణ చరిత్రలో సోనియా గాంధీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు అవేవి ప్రజలకు దక్కడం లేదని, ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్దిపొందుతోందన్నారు. అంతకుముందు డీసీసీ కార్యాలయంలో నుండి పట్టణ పురవీధుల గుండా నర్సిరెడ్డి చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే డీసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి అమరవీరుల స్తూపనికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్టెం.అభిజయ్ రెడ్డి, చిట్టెం పర్నిక రెడ్డి, నర్సిములు, జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోట్ల.రవీందర్ రెడ్డి, పుర కౌన్సిలర్ ఎండి.సలీం తదితరులు పాల్గొన్నారు.