Ghat road : గుట్టపైకి ఘాట్ రోడ్డు కోసం స్థల పరిశీలన

by Kalyani |
Ghat road : గుట్టపైకి ఘాట్ రోడ్డు కోసం స్థల పరిశీలన
X

దిశ, చిన్న చింతకుంట: మండలం అమ్మపూర్ గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికై రెండు చోట్ల స్థల పరిశీలన కోసం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ రెండు ఘాట్ రోడ్డులను వాహనాలు పైకి ఎక్కే దారి మరొకటి వాహనాలు క్రిందికి దిగేదారికి స్థలాలలో నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను గుర్తిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం శ్రీ కురుమూర్తి స్వామిని ఎమ్మెల్యే తో పాటు ఆర్ అండ్ బి ఈ ఎన్ సి తోపాటు అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కొండ దిగిన జాతర మైదానంలో ఆయన మాట్లాడుతూ… శ్రీ కురుమూర్తి స్వామి ఆశీస్సులతో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గత ఎమ్మెల్యే ప్రజాభిప్రాయం లేకుండానే పనులు చేపట్టారని తద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ నరసింగం ,ఈ ఈ దేశ్ నాయక్, ఏ ఈ శ్రీరామ్ రెడ్డి, ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, పార్టీ ఆయా మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు వెంకటేష్, పార్టీ సీనియర్ నాయకులు కథలప్ప, ప్రశాంత్, మాజీ కో ఆప్షన్ మహమూద్ ,వట్టెం శివకుమార్, ప్రతాప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, దామోదర్ ,గంజి బాలరాజ్, ధనుంజయ, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story