డీఎస్సీ ఫలితాల్లో రెండు ఉద్యోగాలకు ఎంపిక

by Naveena |
డీఎస్సీ ఫలితాల్లో రెండు ఉద్యోగాలకు ఎంపిక
X

దిశ, కొల్లాపూర్: డీఎస్సీలో పేదింటి ఆడపడుచు మెరిసింది. ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపికైంది. ఆ రెండు ఉద్యోగాలలో జిల్లా స్థాయి టాప్ ర్యాంకర్ గా నిలిచింది. తెలుగు పండిత్ విభాగంలో జిల్లా ప్రథమ స్థానం,స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)లో ద్వితీయ స్థానంలో నిలిచింది. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి గ్రామానికి చెందిన యువతి నర్లపల్లి స్వప్న ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో..గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరక్షరాస్యులైన తల్లితండ్రులు సుగుణమ్మ, కృష్ణయ్య దంపతులు తమ కూతురిని ప్రయోజకురాలిగా చేయాలన్న సంకల్పంతో ఉన్నత చదువులు చదివించారు. భర్త మల్లేష్ ప్రోత్సాహంతో ఇంటి దగ్గరే ప్రణాళిక బద్ధంగా చదవటంతో..మంచి ఫలితాన్ని సాధించగలిగింది. గృహిణిగా ఉంటూ పట్టుదల,అంకుటిత దీక్షను సడలకుండా లక్ష్యంతో రెండు ఉద్యోగాలు సాధించింది. దీంతో గ్రామస్తులు, బంధువులు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story