- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓపెన్ స్కూల్ అధికారుల నిర్వాకం.. తెలుగుకు బదులు, ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నపత్రం
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించవలసిన ఇంటర్మీడియట్ అర్థశాస్త్రం పరీక్ష ను రద్దు చేస్తూ ఆ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ అర్థశాస్త్రం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మీడియం అభ్యర్థులు పెద్ద ఎత్తున చేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం ఆంగ్లంలో కృష్ణ పత్రాన్ని ముద్రించి సరఫరా చేశారు. పరీక్ష ఆరంభం కాగానే అభ్యర్థులు ప్రశ్నాపత్రాన్ని చూసి తెల్ల మొహాలు వేశారు. విషయాన్ని ఇన్విజిలేటర్ల ద్వారా ఆయా జిల్లాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర అధికారులు ప్రశ్నాపత్రాన్ని తెలుగులోకి పెద్దమా చేసి చెప్పాలి అని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రయోజనం లేకపోవడం, విషయం బహిర్గతం కావడంతో జరిగిన పొరపాటుకు ఓపెన్ స్కూల్ అధికారులు తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మంగళవారం జరగాల్సిన అర్థశాస్త్రం పరీక్షను వాయిదా వేస్తూ జారీ చేశారు. వాయిదా పడిన ఈ పరీక్షను ఈనెల 13వ తేదీన నిర్వహించినట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలు రకాల పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకల వల్ల విమర్శల పాలైన అధికార యంత్రాంగానికి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.