రేపు గద్వాల్, కోస్గి కి రానున్న ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే

by Kalyani |   ( Updated:2023-11-26 15:25:40.0  )
రేపు గద్వాల్, కోస్గి కి రానున్న ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గద్వాల, కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం గం 1. 30 నిమిషాల కు గద్వాలలో సరిత తిరుపతయ్యకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో పీసీస అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి మద్దతుగా నిర్వహించే సభలోఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఏఐసీసీ అగ్ర నేతలు పాల్గొనే సభలను జయప్రదం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed