సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

by Naveena |
సీఎం సహాయనిధి చెక్కుల అందజేత
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రజలకు అత్యవసరమైన విద్యా, వైద్యసేవల్లో రాజకీయాలు చేయమని, అర్హులైన నిరుపేదలందరి ప్రభుత్వం అందించే పథకాలు తప్పనిసరిగా అందచేస్తామని ఎమ్మెల్యే డా.చిట్టెం. పర్ణిక రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ పి.బెన్ షాలం తో కలసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 138 మంది లబ్ధిదారులులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మంజూరు విషయంలో రాజకీయాలు చేశారని, కొన్ని చెక్కులు మంజూరు అయినా నేటికి లబ్ధిదారులకు అందలేదన్నారు. పేదప్రజలకు అందించే పథకాల విషయంలో రాజకీయాలు చేసే.. బ్రతికే జీవితం వ్యర్థమని పేర్కొన్నారు. స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి ఆదర్శంతో పేద ప్రజలకు అందించే వైద్యం,విద్యా విషయల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో మధ్య దళారులను నమ్మొద్దని నేరుగా తనను సంప్రదించాలని లబ్ధిదారులకు సూచించారు. చెక్కుల మంజూరులో ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed