- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దిశ, నారాయణపేట ప్రతినిధి : రానున్న తీవ్ర ఎండాకాలంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం కలెక్టర్ విసి హాల్లో వాతావరణం మార్పులు, వేసవికాలం ఎండ తీవ్రత వడదెబ్బ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు ప్రయాణాలలో త్రాగునీరు వెంట తీసుకెళ్లాలన్నారు. ఎండ తగలకుండా తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు. చిన్నారులు, మహిళలు వృద్ధులు గర్భిణీలు ఎండ పట్ల తగు జాగ్రత్త వహించాలన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఉపయోగించాలని ,నిమ్మరసం, మజ్జిగ ,పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారు చేసిన పానీయాలు కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలన్నారు. సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించాలని తలను కప్పుకోవాలని సూర్య రష్మి తగలకుండా గొడుగు టోపీ టవల్ వాడాలన్నారు. కార్మికులు నేరుగా సూర్య రష్మికి గురికాకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్మికులకు కూలీలకు షెడ్డు ఏరియాలో ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్నం 12 నుండి మూడు గంటల వరకు ఎండలో బయటకు రాకూడదనీ ఇలాంటి జాగ్రత్తలు వేసవిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం వడదెబ్బ జాగ్రత్తలపై గోడపత్రికను విడుదల చేశారు. ట్రైని కలెక్టర్ గరిమా నరుల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.