క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : కలెక్టర్ శ్రీ హర్ష

by Vinod kumar |
క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : కలెక్టర్ శ్రీ హర్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: క్యాన్సర్ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీ హర్ష డాక్టర్లకు సూచించారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని చిన్న పిల్లల ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ఆసుపత్రిలోని క్యాన్సర్ స్పెషల్ వార్డ్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఎంత మంది క్యాన్సర్ బాధితులు, డయాలసిస్ రోగులు హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నారో.. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరును, ఆసుపత్రికి వచ్చే రోజు వారి అవుట్ పే షేంట్స్ సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నీటి కొరత ఉందని కొంత మంది రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంజిత్, నర్సింగ్ సూపరిండెంట్ సరోజ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed