- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చెత్తాచెదారంతో డ్రైనేజీలు...రోగాల బారిన పడుతున్న కాలనీవాసులు
దిశ, బిజినేపల్లి : చెత్తాచెదారంతో డ్రైనేజీలు తయారు అయ్యాయని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో డ్రైనేజీలు నిండి అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆయా కాలనీలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీలో ప్లాస్టిక్ కవర్, ఖాలీ వాటర్ బాటిల్ తో పాటు చెత్తాచెదారం నుండి దానికి తోడు దోమలు ఆవాసంగా చేసుకోవడంతో ఆయా కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామపంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని గ్రామంలో కార్మిక సిబ్బందిని, ట్రాక్టర్ ను ప్రవేశపెట్టితే వాటిని తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
పంచాయితీ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వారికి కేటాయించిన గ్రామపంచాయతీకి రావాల్సి ఉండగా సమయపాలన పాటించకుండా వారి ఇష్టానుసారంగా గ్రామపంచాయతీలకు వచ్చి గంట సేపు కాలయాపన చేసి తిరిగి మండల కార్యాలయానికి చేరుకుంటారు. ప్రతికాలనీలో ఏ సమస్య ఉందో తెలుసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయా కాలనీల వాసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి చెత్తాచెదారంతో నిండిన డ్రైనేజీలు శుభ్రం చేయాలని ఆయా కాలనీవాసులు కోరుచున్నారు.