ఆ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు..

by Sumithra |
ఆ ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : సాధారణంగా మనం ప్రభుత్వ పాఠశాల అంటే ఆరుగురు విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు... లేదా ముగ్గురు ఉపాధ్యాయులకు ఆరుగురు విద్యార్థులు... లేదా పాఠశాలలో విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు ఉండరు... ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు ఉండరు.... విద్యార్థులు ఉపాధ్యాయులు ఉంటే మౌలిక వసతులు ఉండవు అనే పరిస్థితులను చూసే ఉంటాం. కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాల ప్రత్యేకత వేరు. ఎందుకంటే ఈ పాఠశాలలో విద్యార్థులు అడ్మిషన్ల సంఖ్య ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ వస్తుంది. కారణంగా ఈ అకాడమిక్ పాఠశాలలో మొత్తం సుమారు 870 మంది విద్యార్థులు ఉన్నారు. కాగ గ్రౌండ్ ఉన్నదా పాఠశాలలో డిజిటల్ క్లాసులు కూడా కొనసాగుతున్నాయి.

నో అడ్మిషన్ బోర్డు...

నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో 2024, 25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు లేవని పాఠశాల నిర్వాహకులు నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ప్రతి క్లాసులో 40 నుంచి 75 మంది వరకు గరిష్టంగా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతి క్లాస్ లుగా మూడు సెక్షన్లుగా విభజించారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం... పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు రావడంతో పీఎంసీ పథకం కింద గ్రౌండ్ ఉన్నంత పాఠశాల ఎంపికయింది. అదనపు నిధులు రావడంతో పాఠశాలలో మరిన్ని మౌలిక వసతులు కల్పించారు.

విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతుందంటే....

గ్రౌండ్ ఉన్నత పాఠశాల చాలా పురాతన పాఠశాల. దీనికి తోడు బస్టాండ్ కు అతి సమీపంగా ఉండడం.. ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండటం.. తరగతులు క్రమం తప్పకుండా జరగడం.. మధ్యాహ్న భోజనం... విద్యార్థులకు పుస్తకాలు వస్తువులు అందించడం వంటి కారణాలతో ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. కాగ గ్రౌండ్ ఉన్నదా పాఠశాలలో డిజిటల్ క్లాసులు కూడా కొనసాగుతున్నాయి. గత కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సొంత ఫండ్ (మన ఊరు మనబడి పథకం కాకుండా) సుమారు రూ. 24 లక్షల నిధులు కేటాయించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు.

Next Story