నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు

by Kalyani |
నవోదయ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, బిజినేపల్లి: వట్టేం జవహర్ నవోదయ విద్యాలయంలో 2024- 26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు గడువును పరిపాలన కారణాల రీత్యా ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ, లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

నవోదయలో 6వ తరగతి ప్రవేశం కోరేటువంటి అభ్యర్థులు ప్రస్తుతం ఐదో తరగతి (2024-25)ఉమ్మడి జిల్లాలోనే చదువుతూ ఉండి, అభ్యర్థుల తల్లిదండ్రుల నివాసం ఉమ్మడి జిల్లాలోనిదై ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. దీనికి ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధ్రువపత్రం, ఫోటోతో దరఖాస్తును ఆన్లైన్ లో సమర్పించవచ్చని తెలిపారు. ఈనెల 23వ తేదీ చివరి తేదీ అని, ఉమ్మడి జిల్లాలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు త్వరపడి తమ తమ పిల్లలను ప్రోత్సహించి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed