- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిడుగుర్తిలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం
దిశ, ఊట్కూర్: జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని (నవంబర్ 26) నిడుగుర్తి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం గొప్పతనం తెలిసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల వేషధారణలో వచ్చిన విద్యార్థులు చూపరులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా రాజ్యాంగం గొప్పతనం తెలిసేలా ప్రదర్శించిన నాటకాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా హెచ్ఎం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మనిషికి హృదయం ఎలాంటిదో దేశానికి రాజ్యాంగం అలాంటిది అని అన్నారు. భారతీయులు అంటే మూఢాచారాలు అని చులకన చేసిన ప్రపంచానికి డా. రాజేద్రప్రసాద్, అంబేడ్కర్, కేఏం మున్షీ వంటి మేధావుల కృషితో ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని సాధించగలిగామని చెప్పారు. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మ, సునీత, వెంకటప్ప, సుజాత, సలాం, లియాకత్, శ్రీనివాస్, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.