- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టెం..
దిశ, ఊట్కూర్: మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు.
వరి ధాన్యానికి క్వింటాల్ కి, ఏ గ్రేడ్ కి 2060 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీ, సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, మాన్కరింగ్ అధికారి అనసూయ, రైతు బంధు మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరవింద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.