- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కల్తీకల్లుకు బాధ్యుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్: డీకే అరుణ
దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో విక్రయిస్తున్న కల్తీకల్లుకు పూర్తి బాధ్యుడు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కల్తీకల్లు ఏరులై పారుతున్నా విషయం ఆబ్కారి మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ కు తెలియదా అని, ముగ్గురి మరణాలకు నైతిక భాద్యత వహించి ఆయన తమ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బాధితులను పరమార్శించడానికి వెళ్లితే ప్రతిపక్షాలు, మీడియాను ఆసుపత్రిలోకి అనుమతించకపోవడం లేదంటే, మంత్రి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. స్థానిక మంత్రి చేతుల్లోనే ఎక్సైజ్ శాఖ ఉంచుకొని, స్థానికంగా కల్తీకల్లును కట్టడి చేయడానికి చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, ఎన్పీ వెంకటేష్, పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.