- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైభవంగా 'మన మహబూబ్ నగర్ మహ నగరోత్సవం' ప్రారంభం

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పోరేషన్ గా మారినందున,మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలోని శిల్పారామంలో 'మన మహబూబ్ నగర్ మహా నగరోత్సవం' వేడుకలు శుక్రవారం రాత్రి వైభవంగా మొదలైయ్యాయి.రెండు రోజులు కొనసాగే ఈ వేడుకలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి ప్రారంభించారు.మార్కెట్ స్టాల్,ప్రభుత్వ స్టాల్స్,ఫన్ గేమ్స్,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.పెద్దఎత్తున తరలి వచ్చిన పట్టణ ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది.ఈ సందర్భంగా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీ గా ఉన్న మహబూబ్ నగర్ ను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి తో 'మహబూబ్ నగర్ కార్పొరేషన్' గా ఏర్పాటు చేయడం జరిగిందని,మున్సిపల్ పరిధిలోని పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని,అందుకు కార్పొరేషన్ కు అందరూ చేయూతనివ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.