- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హమీలను నెరవేర్చని బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడిద్దాం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దిశ , కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి: గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పెద్దకొత్తపల్లి మండల పరిధిలో 76వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే విడతలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని భట్టి అన్నారు.
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెళ్లయిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, టిపిసిసి సభ్యులు చింతలపల్లి జగదీశ్వరరావు, ఏఐసీసీ ఓబీసీ జాతీయ కో ఆర్డినేటర్ కేతురు వెంకటేష్, టిపిసిసి మహిళా కార్యదర్శి కాటమొని తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.