ఉపాధ్యాయ లోక సేవ చేసేందుకు ఆశీర్వదించండి: ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి

by S Gopi |
ఉపాధ్యాయ లోక సేవ చేసేందుకు ఆశీర్వదించండి: ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి
X

దిశ, మద్దూరు, కొత్తపల్లి: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేది ఒక పీఆర్టీయూ సంఘం మాత్రమే అని, మహిళ సోదరీమణుల పక్షపాతి 317 జీఓ బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని సంఘం ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయస్సు 61 సంవత్సరాలు చెప్పించిన ఘనత పీఆర్టీయూదేనని అన్నారు. సీపీఎస్ విధానం రద్దు, 317 జీవో బాధితులకు న్యాయం చేయుటకై, బదిలీలు, ప్రమోషన్లు, పండిత, పీఈటీల ఉన్నతీకరణ, ఆరోగ్య సంరక్షణ కార్డు తదితర సమస్యలను సంఘ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధిస్తాను అని ధీమాను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు తనకు మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి ఉపాధ్యాయ సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి నరసింహారెడ్డి, వై జనార్దన్ రెడ్డిలతోపాటు మండల విద్య శాఖ అధికారి గోపాల్ నాయక్, జిల్లా అధ్యక్షులు అనంతప్ప, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మరియు మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అసోసియేట్లు లాజర్, మల్లేశం, శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ గట్టు వెంకటరెడ్డి, సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా బాధ్యులు, ప్రాథమిక సభ్యులు రవికుమార్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, భాస్కర్, హన్మంతు, శ్రీనివాస్, ఇబ్రహీం, వెంకటప్ప, శ్రీకాంత్, విజయకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed