దారుణం... ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

by S Gopi |
దారుణం... ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఆరేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో తన అమ్మమ్మతో కలిసి చిన్నారికి మాయమాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు శనివారం తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. చిన్నారి నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి అత్యాచారంకి గురైనట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిని వనపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. కాగా, బాలిక కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed