మీ సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: కూనంనేని

by S Gopi |   ( Updated:2022-12-27 14:58:23.0  )
మీ సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: కూనంనేని
X

దిశ, గద్వాల: చిన్నోనిపల్లి భూ నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని మంగళవారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను సందర్శించి ఐదు గ్రామాల భూనిర్వాసిత రైతులు గత 334 రోజులుగా చేస్తున్న పోరాట దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని రమేష్ మద్దతు తెలిపారు. దీక్ష నుద్దేశించి ఆయన మాట్లడుతూ.... గత అనేక రోజులుగా చిన్నోనిపల్లి రైతులు రిజర్వాయర్ లో భూమిని కోల్పోయిన రైతులు తిరిగి భూమినివ్వాలని పోరాటం చేస్తున్నారని, ఎలాంటి ఉపయోగం లేని రిజర్వాయర్ వల్ల భూమిని కోల్పోయిన రైతులకు తిరిగి ఇచ్చి రిజర్వాయర్ ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్క ఎకరాకు 100 మంది బ్రతకచ్చు.. అలాంటిది 2500 ఎకరాలు పోతే సుమారు రెండు లక్షల 50 వేల జనాభా జీవనం, ఉపాధి కోల్పోతారని ఆయన అన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ భూనిర్వాసితులు 334 రోజులుగా చేస్తున్న ఉద్యమం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన నిర్వాసితులకు హామీ ఇచ్చారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ రద్దు చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నరసింహ, వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి బాల్ కిషన్, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed