నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పెరిగిన వరి సాగు: జడ్పీ చైర్ పర్సన్ వనజ

by Kalyani |
నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పెరిగిన వరి సాగు: జడ్పీ చైర్ పర్సన్ వనజ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నాణ్యమైన విద్యుత్ సరఫరా కారణంగానే మన రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని జడ్పీ చైర్ పర్సన్ వనజ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిపి శెట్టి ఫంక్షన్ హాల్ లో విద్యుత్ ప్రగతి అంశంపై ఏర్పాటు చేసిన సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ వనజ, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మయాంక్ తదితరులు హాజరయ్యారు. ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలకు విద్యుత్ వినియోగం ఎంతో అవసరమని తద్వారానే ఉపాధి సాధ్యమవుతుందని పేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో విద్యుత్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా కళాకారులు విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి గురించి ఆటపాటలతో వివరించారు. అలాగే రాష్ట్రంలో, జిల్లాలో విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని దృశ్య రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు విద్యుత్ ఆధారిత సమస్యలపై ఎమ్మెల్యే, సంబంధిత అధికారులకు వినతులను అందించేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, ఏఎంసీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, ఎంపీపీ అమ్మ కోళ్ల శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story