- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కులాలను చూసి నేను పని చేయలేదు : డీకే. అరుణ
దిశ, గద్వాల / ధరూర్ : కులాలను చూసి నేను పనిచేయలేదని, అందరూ నా వాళ్ళు అనే భావనతో పని చేశానని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గద్వాల నియోజకవర్గం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలిగేర బోయ శివారెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు ధరూర్ మండలం డ్యాగ దొడ్డి, ఉప్పెర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన బడుగు బలహీన వర్గాల బిడ్డగా మీ ఊరికి వచ్చిన బీజేపీ పార్టీ అభ్యర్థి బోయ వాల్మీకి శివారెడ్డిని కమలం గుర్తుకు ఓటు వేసి, వేయించి ఆశీర్వదించాలని గ్రామస్థులను అభ్యర్థించారు.
గ్రామాల్లో నా ఒక్క కులానికే రోడ్డు వేయలేదన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు సాధించడంతో నేడు పంట పొలాలు పచ్చగా మారి రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పాదయాత్ర చేసి నెట్టెంపాడు సాధించడంతో నా ఒక్క కులానికి నీళ్లు రాలేదని, గ్రామాల్లో నా ఒక్క కులానికి రోడ్లు వేయలేదని, అందరు నావాల్లే అనే భావనతో పని చేశానని డీకే.అరుణ అన్నారు. పదేళ్లలో తట్టెడు మట్టి తీయాలేని అసమర్థ ప్రభుత్వం ఎన్నికల రాగానే గట్టు ఎత్తిపోతల పథకం గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. గద్వాల ప్రాంతంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఈ పదేళ్లలో ఒక్క అభివృద్ధి చేసింది లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయన్నారు.
రైతులకు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చి యూరియా ను తక్కువ ధరకే ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వమన్నారు. గ్రామాల్లో రోడ్లు, వీధి దీపాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడబిడ్డల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం, బేటి బచావో బేటి పడావో లాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చిందన్నారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిర్జాపురం రామచంద్ర రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ సంజీవ్ భరద్వాజ్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దరూరు కుర్వకిష్టాన్న , మండల అధ్యక్షుడు రాజేష్ అయ్యా, సర్పంచ్ మాసమ్మ,వాల్మీకి నాయకులు వైండింగ్ రాములు, రాముడు, మండల నాయకులు హన్మంత రాయ, సుధాకర్ రెడ్డి, లక్ష్మన్న , ఉప్పెర్ అంజి రెడ్డి, అది మల్ల రెడ్డి, సరలమ్మ, రఘు గౌడ్, పండు, తదితరులు ఉన్నారు.
- Tags
- D. K. Aruna