నల్లమలలో భారీ వర్షం…నిలిచిన రాకపోకలు

by Kalyani |
నల్లమలలో భారీ వర్షం…నిలిచిన రాకపోకలు
X

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ పరిధిలోని ఎగువన నల్లమల అడవుల్లో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షాలకు ఎర్రగట్టు పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నార్లాపూర్ - ముక్కిడి గుండం గ్రామాల మధ్య రాకపోకలు శుక్రవారం ఉదయం నుంచి స్తంభించిపోయాయి. ప్రజలు తమ అవసరాల కోసం ముక్కిడి గుండం నుంచి మొల చింతపల్లి మీదుగా ఒక్కరికి ఆటోల్లో రాను పోను చార్జీలు రూ. రెండు చెల్లించి కొల్లాపూర్ మండల కేంద్రానికి చేరుకుంటున్నట్టు ఆ గ్రామ మహిళా సంఘం నాయకురాలు కోడావత్ శాంతమ్మ వాపోయారు.

వానాకాలం వచ్చిందంటే తమకు కష్టాలు మొదలవుతాయన్నారు.పెద్ద వాగు పై రూ. 9.40 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణం పనులు ఆలస్యంగా మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు. లేకుంటే కాంట్రాక్టర్ సకాలంలో వంతెన పనులు పూర్తి చేసి ఉంటే తమ గ్రామస్తులకు ఈ కష్టాలు వచ్చేవి కావని ఆమె చెప్పారు. పెద్ద వాగు పై వంతెన పనులు జరుగుతుండగానే తుఫాను కారణంగా ముక్కిడి గుండం - నార్లాపూర్ గ్రామాల మధ్య ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed