Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. పోలీసుల రూట్‌మ్యాప్‌లు ఇవే!

by Shiva |   ( Updated:2024-09-16 07:12:13.0  )
Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. పోలీసుల రూట్‌మ్యాప్‌లు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: దశ రాత్రుల పాటు నిర్విరామంగా పూజలందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జన క్రతువునకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి (Khairathabad Ganesh) వద్ద కర్రల తొలగింపు పనులు స్టార్ట్ అయ్యాయి. ఇక మహా గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే భారీ ట్రక్కు ఇప్పటికే విగ్రహం వద్దకు చేరుకుంది. దీంతో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించడం లేదు. మరోవైపు షెడ్ వెల్డింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం సరిగ్గా 7 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ముగియనుంది. ఇక హుస్సేన్ సాగర్ (Hussain Sagar) చుట్టూ మెుత్తం 31 క్రేన్లుతో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పా్ట్లు చేశారు.

నిమజ్జన రూట్‌మ్యాప్‌లు ఇవే..

రూట్ నెం.1: బాలాపూర్ గణేశ్ (Balapur Ganesh) శోభాయాత్ర: బాలాపూర్ నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా, రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్ చింత, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్క్, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్ వైపుగా వెళ్తుంది.

రూట్ నెం.2: సౌత్ జోన్- హుస్సేనీ ఆలం, బహదూర్‌పురాలో గణేశ్ శోభాయాత్ర కొనసాగుతుంది.

రూట్ నెం.3: ఈస్ట్ జోన్- రామంతపూర్, తార్నాక, హబ్సీగూడ, చిలకలగూడ క్రాస్ రోడ్స్, కాచిగూడ, ఇస్మాయిలీ బజార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతుంది.

రూట్ నెం.4: ధూల్‌పేట, టప్పాచబుత్రా, రేతిబౌలి మీదుగా శోభాయాత్ర ముందుకు సాగనుంది.

రూట్ నెం.5: వెస్ట్ జోన్- ఎర్రగడ్డ, బల్కంపేట, యూసుఫ్ గూడ, ఎన్టీఆర్ భవన్, అగ్రసేన్ జంక్షన్ మీదుగా హుస్సేన్ సాగర్ వైపు శోభాయాత్ర కొనసాగుతుంది.

రూట్ నెం.6: నార్త్ జోన్ - గణేశ్ టెంపుల్, సికింద్రాబాద్, బేగంపేట వైపు ముందుకు సాగనుంది.

Advertisement

Next Story

Most Viewed