దారుణం.. సొంత చెల్లినే గర్భవతిని చేసిన అన్న

by Anjali |   ( Updated:2024-07-14 06:54:22.0  )
దారుణం.. సొంత చెల్లినే గర్భవతిని చేసిన అన్న
X

దిశ నాగర్ కర్నూల్ /బిజినపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు సొంత చెల్లినే గర్భవతిని చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కీమ్యాతాండలో చోటుచేసుకుంది. ఓ మహిళకు కూతురు, కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల వయసు ఉన్న సొంత చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లోబరుచుకొని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. దీనితో ఆ బాలిక గర్భం దాల్చింది. 15 రోజుల క్రితం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దరం అటవీ ప్రాంతంలో అన్నా చెల్లెలు తిరిగినట్లు తెలిసింది. మర్నాడు ఖిల్లగనపురంలో నడుచుకుంటూ వెళ్తుంటే స్థానికులకు అనుమానం వచ్చి 1098 చైల్డ్ లైన్ కి సమాచారం ఇచ్చారు. దింతో వనపర్తి చైల్డ్ లైన్ అధికారులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మహబూబ్ నగర్ టు టౌన్ కి బదిలీ చేశారు. అక్కడి పోలీసులు బిజినపల్లి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed