రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు గురుకుల విద్యార్థులు ఎంపిక..

by Kalyani |
రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు గురుకుల విద్యార్థులు ఎంపిక..
X

దిశ, మరికల్/ధన్వాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈ నెల 28 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనుంది. కాగా సీఎం కప్ పోటీలకు కొండాపూర్ గురుకులంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న 8 మంది ఫుట్ బాల్ క్రీడాకారులు, ఇద్దరూ రెజ్లింగ్ క్రీడాకారులు, 9 మంది హ్యాండ్ బాల్ క్రీడాకారులు మొత్తంగా 19 మంది క్రీడాకారులు నారాయణపేట జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారని కొండాపూర్ గిరిజ గురుకుల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రామ్మోహన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ రాజారాం, వైస్ ప్రిన్సిపాల్ సురేష్ రావు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.

Advertisement

Next Story