ఒంటరి పురుషులకు గృహ లక్ష్మి పథకం అమలు చేయాలి : ఒంటరి దువ్యాంగుడు

by Sumithra |   ( Updated:2023-08-10 10:33:13.0  )
ఒంటరి పురుషులకు గృహ లక్ష్మి పథకం అమలు చేయాలి : ఒంటరి దువ్యాంగుడు
X

దిశ, వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటి స్థలం ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలలోని పేద ప్రజలకు, ఒంటరి మహిళలలకు ఇళ్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన విషయం విధితమే. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో మేడం దామోదర్ (39) బజ్జీల బండి నడుపుకుంటూ జీవనోఉపాధి పొందుతున్న వికలాంగుడి ఆవేదన తీర్చే వారు కరువైయ్యారు. 2015 సంవత్సరంలో తండ్రి నీ, 2021 సంవత్సరంలో తల్లి మరణించిన అనంతరం, ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటూ 6 వేల రూపాయలు అద్దె చెల్లించేందుకు, రోజుకు 300 రూపాయలు సంపాదించే వ్యక్తి ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారాతన సోదరుడు తనకు ఇస్తాన్న ఇంటి స్థలంలో రెండు గదులు వేసుకోవాలని ఆశపడ్డ తనకు నిరాశే ఎదురైందని దామోదర్ ఆవేదన చెందుతున్నాడు.

తల్లిదండ్రులను కోల్పోయీ ఒంటరిగా మిగిలిన తాను ఏమాత్రం క్రుంగి పోలేదు,వికలత్వం తో ఒక్క చేతితో సాయంత్రం సమయాలలో మిర్చిబజ్జిబండినడుపుకుంటూ,ఉదయం తన బావ టిఫిన్ సెంటర్ లో చేదోడు వాదోడుగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మిర్చి బజ్జీలు, వడలు కొనేందుకు వచ్చిన చిన్న, పెద్దనాయకులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉద్యోగులను తనకు ఒక డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేసేందుకు సహాయం చేయమనిఅడిగేవాడు.ఎవరునుండి ఏటువంటి సహాయం అందలేదు. బీఆర్ ఎస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ పేదలకు కేసీఆర్ ఇళ్లు కట్టుకునేందుకు మూడు లక్షలు ఎప్పుడు ఇస్తారని వాకబు చేసేవాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని రెండు రోజులు గడువు పెట్టడం తో అది మహిళ పేరుపైనే ఇస్తామన్న నిబంధన ఎటుతోచని పరిస్థితిలో పడ్డాడు.

సడలించండి...సహకరించండి : ఒంటరి దివ్యాంగులు మేడం దామోదర్

దామోదర్ కు తన సోదరుడు తనకు ఇస్తానన్న ప్లాటు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న,తనకు వివాహం కాలేదు,రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గృహలక్ష్మి పథకం కు అర్జీ పెట్టుకునేందుకు రెండు రోజుల గడువు నేటితో ముగుస్తుండడం తో దివ్యాంగుడు దామోదర్ గందరగోళంలో పడ్డాడు. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మంత్రి, తనపై దయవుంచి ఒంటరి పురుషుడు గా జీవిస్తున్న తనకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు నిబంధనను సడలించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed