మార్కెట్ కమిటీ సభ్యుల లిస్ట్ జీవోను జారీ చేసిన ప్రభుత్వం

by Naveena |
మార్కెట్ కమిటీ సభ్యుల లిస్ట్ జీవోను జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, మక్తల్: మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లిస్టును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది. గత రెండు వారాల కింద మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఏఎంసి అధ్యక్ష,ఉపాధ్యక్ష సభ్యుల లిస్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా..దానిని పరిశీలించి బుధవారం జీవో జారీ చేసింది. మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా గవినోల రాధమ్మ. ఉపాధ్యక్షుడిగా బొందల కుంట గణేష్ కుమార్ నియవిుంచారు. అలాగే 18 మంది సభ్యులతో కూడిన లిస్టును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. జీవో నంబర్885.11.12.2024, మెమో నం.5404/ఎంకెటిఎల్ (1)/2018-17,ఎఅండ్ సి (ఎంకెటిఎల్) డిపార్ట్‌మెంట్,తేది07.03.2024.ఎం.రఘునందన్ రావు, ఎపిసి& ప్రభుత్వ కార్యదర్శి జారీ చేసినట్టుగా సమాచారం. మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ,సభ్యులతో ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల కాలపరిమితితో కమిటీ సభ్యుల పదవి కాలం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గెజిట్లో పేర్కొంది. ఏఎంసి కమిటీ అద్యక్షురాలుగా,కమిటీ సభ్యులుగా తమను ఎన్నుకున్నందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి టి శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed