- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ జెండాను నిలబెట్టింది గద్వాల జిల్లా : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, అలంపూర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గులాబీ జెండాను నిలబెట్టి పరువు కాపాడింది జోగులాంబ గద్వాల జిల్లా అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ… ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1439 ఓటర్లు ఉండగా అందులో 1050 మంది బీఆర్ఎస్ తరపున ఎన్నికైన వారు ఉన్నారని అన్నారు. ప్రత్యర్థి పార్టీలు మన దరిదాపుల్లో లేవని ఎన్నిక ఏకపక్షమే అని అన్నారు.
అధికార పార్టీ ప్రలోభాలకు లోను కాకుండా నవీన్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గద్వాల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీని కూడా గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ… స్థానిక ప్రజాప్రతినిధులు సమిష్టిగా పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జడ్పీటీసీలు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.