- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పింఛన్ ఇప్పిస్తానని మోసం.. యువకుడి అరెస్ట్
దిశ, భూత్పూర్: ఆసరా పింఛన్లు ఇప్పిస్తానని పలువురు వృద్ధులకు మాయమాటలు చెబుతూ వారి ఆధార్, ఫింగర్ ప్రింట్ తీసుకొని బ్యాంకు ఖాతా నుంచి నోవో పే ఐడీతో తరచూ డబ్బులు కాచేస్తున్న ఓ యువకుడిని భూత్పూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు ఆదివారం సీఐ రజిత ఆదేశాల మేరకు ఎస్సై భాస్కర్ రెడ్డి, కానిస్టేబుల్ వెంకటేష్ నిందితుడిని కోకిల మడుగు గ్రామంలో మరోసారి మోసం చేసేందుకు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జడ్చర్లకు చెందినరాఘవేందర్ అనే యువకుడు జడ్చర్ల, రాజాపూర్, మిడ్జిల్, భూత్పూర్ మండలాల్లో వృద్ధులను మోసం చేసి డబ్బులు కాజేస్తూ వచ్చాడు. ఈ మేరకు భూత్పూర్ మండలంలో రెండు కేసులు, మిగతా మండలాలలో ఒక్కొక్క కేసు రాఘవేందర్ పై నమోదు అయినట్లుగా సీఐ తెలిపారు. నిందితుడు నుండి రూ.50 వేల నగదు, ఫింగర్ ప్రింట్ డివైన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు సీఐ వెల్లడించారు.