జూరాల ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

by Nagam Mallesh |
జూరాల ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద
X

దిశ, గద్వాల: మూడు రోజుల నుంచి ఎగువ ప్రాంతాన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు కర్ణాటక జలాశయమైన‌ నారాయణపూర్ డ్యాం 13గేట్ల ద్వారా 49,331 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేశారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 94,000 క్యూసెక్కుల వదర వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 318.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం గరిష్టంగా 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.439 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జూరాలకు 94వేల క్యూసెక్కులు ఇన్ ప్లో ఉండగా‌‌. ఔట్ ప్లో 1,21,244 క్యూసెక్కులు నమోదయింది.

Advertisement

Next Story

Most Viewed