- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..
దిశ,గద్వాల క్రైమ్ :ప్రజావాణి కార్యక్రమంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. తన భూ సమస్యని పరిష్కరించకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఓ రైతు పురుగుల ముందు తాగాడు. గుడు దొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడు (45) తన పొలం వేరే వారిపై ఐజ ఎమ్మార్వో రిజిస్టర్ చేశాడని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన భూమి తనకు రిజిస్టర్ చేయాలని వేడుకున్న ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ ముందు పురుగుల మందు తాగేశాడు. పోలీసులు రైతుని గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి జూలై మాసంలో కూడా ఒకసారి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ముందు పురుగుల మందు తాగాడు, అంతేకాకుండా స్వస్థలం అలంపూర్ తాలూకా ఐజ మండలం గుడు దొడ్డి గ్రామం నుంచి కుటుంబ సభ్యులు అంతా కలిసి కాలినడకన హైదరాబాద్ ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి అక్కడ కూడా వినతి పత్రం సమర్పించామన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు, సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమకు న్యాయం చేసి తమ పొలాన్ని తమకు ఇప్పించాలని కుటుంబ సభ్యులు విలపిస్తూ వేడుకుంటున్నారు.