- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DK Aruna : వక్ఫ్ సవరణలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
దిశ, కొత్తకోట: వక్ఫ్ సవరణలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హితవు పలికారు. ఆదివారం కొత్తకోటలోని మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ… నిరుపేద ముస్లింలకు న్యాయం చేసేందుకే వక్ఫ్ బోర్డులో సవరణలు చేయడానికి కేంద్రం పూనుకుందని, వక్ఫ్ బోర్డు భూ బాధితులకు, అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటయిందని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల జాయింట్ పార్లమెంట్ కమిటీ వాదనలు వింటోందని, ఇక్కడి నుంచి కూడా మీ అభిప్రాయాలను జేపీసీకి తెలపవచ్చన్నారు. అలాంటి వారికోసం జేపీసీ కోసం ప్రత్యేకంగా ఈమెయిల్ క్రియేట్ చేసిందని దాని ద్వారా కూడా మీ అభిప్రాయాలు చెప్పొచ్చన్నారు.
ఈ నెలాఖరున తెలంగాణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వస్తుందని, మీరు పంపే రిప్రెసెంటేషన్ లోని సమస్య తీవ్రతను బట్టి జేపీసీ మీ అభిప్రాయాలు తెలుసుకుంటుందని ఆమె తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణలపై కొందరు ముస్లింల భూములు లాక్కుంటారు, కబ్రస్తాన్ లు లాక్కుంటారు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, వక్ఫ్ బోర్డు ఏర్పాటు ఉద్దేశం క్షేత్ర స్థాయిలో నెరవేరడం లేదన్నారు. బీజేపీని మతతత్వ పార్టీ గా ముద్ర వేసి కొందరు లబ్ది పొందాలని చూస్తున్నారని, అలాంటి వారి కుయుక్తులు నడవవు అన్నారు.
వక్ఫ్ భూ బాధితుల్లో ముస్లింలు, హిందువులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని ఆమె తెలిపారు. ఇప్పుడున్న వక్ఫ్ చట్టం ద్వారా ఏ ఒక్క నిరుపేద ముస్లింలకు లాభం జరగడం లేదని అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణల కోసం బిల్లు తెస్తుందని వివరించారు.ఈ సమావేశంలో బీజేపీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కొమ్ము భరత్ భూషణ్, కౌన్సిలర్ నారాయణమ్మ వెంకట్ రెడ్డి, నాయకులు రాజవర్దన్ రెడ్డి, దాబా శ్రీనివాస్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, మాధవరెడ్డి, డాక్టర్ హరిన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాలు, బాలస్వామి, రాఘవేంద్ర గౌడ్, కొమ్ము సురేష్, తదితరులు పాల్గొన్నారు.