Mallu Ravi : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందాలి

by Kalyani |
Mallu Ravi : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందాలి
X

దిశ,వనపర్తి : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వహించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడి ఓసి సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం,ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తో కలిసి విద్యా, వైద్యం, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులపై, ధరణి ద్వారా సమస్యలు పరిష్కారం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ… కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, మౌలిక వసతుల కల్పన కోసం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed