- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా డబ్బులు మాకు ఇవ్వరా.. బ్యాంకు మేనేజర్ నిలదీసిన ఖాతాదారులు..
దిశ, అచ్చంపేట : సరిగ్గా ఏడాది క్రితం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో ఖాతాదారులైన మోకురాల దాస్ గౌడ్, సునందల, అనితలతో పాటు 21 మంది అకౌంట్లో దాచుకున్న ఖాతాదారుల డబ్బులు మాయమయ్యాయి. సుమారు రూ. 95 లక్షలు బ్యాంకులో పనిచేస్తున్న క్లర్క్ ఖాతాదారులకు తెలియకుండానే నేరుగా తన అకౌంట్ తో పాటు కుటుంబ సభ్యుల అకౌంట్ లోకి దొడ్డి దారిన ట్రాన్స్ఫర్ చేసుకొని మాయం చేశారు. ఈ విషయం జరిగి ఏడాది అవుతున్నా ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకపోవడం పై సోమవారం ఖాతాదారులు బ్యాంకు మేనేజర్ ని కలిసి మా డబ్బులు ఎప్పుడిస్తారు ? ఎంతకాలం తిప్పుతారు ? మా డబ్బులు మాకు ఇస్తారా.. ఇవ్వరా లేక ఇలా ఎంతకాలం కాలయాపన చేస్తారని బ్యాంకు మేనేజర్ ను టీపీసీసీ ఎన్నారై సెల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ బొజ్జ అమరేందర్ రెడ్డితో కలిసి నిలదీశారు. ఖాతాదారులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. బ్యాంకు మేనేజర్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇప్పటికే బ్యాంకు పై తప్పుడు సంకేతాలు వెళ్లాయని, ఇటీవల ఎస్బీఐ బ్యాంకు విజిలెన్స్ అధికారుల విచారణ చేపట్టారని మరోసారి విచారణ చేయాల్సి ఉందని అన్నారు. అందుకు కొంతమంది ఖాతాదారులను హైదరాబాద్ ప్రధాన బ్రాంచ్ కి తీసుకెళ్లి వారితో స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని మేనేజర్ తెలిపారు.
త్వరగా చర్యలు తీసుకోండి..
బ్యాంకులో ఉన్న మీ ఖాతాదారులు డబ్బులు జమ చేస్తే బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు ఇలా ఖాతాదారుల డబ్బులు మాయం చేస్తే ప్రజలకు బ్యాంకుల పై నమ్మకాలు పోతాయని, డబ్బులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నారై అడ్వైజరి కమిటీ సభ్యులు అమరేందర్ రెడ్డి బ్యాంకు మేనేజర్ ఎస్బీఐ మేనేజర్ హుస్సేన్ భాషను గట్టిగా నిలదీశారు. బ్యాంకు అధికారుల నుంచి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఎలాంటి ప్రోగ్రెస్ కనిపిస్త లేదని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి త్వరగా తీసుకెళ్లి న్యాయం చేయాలని మేనేజర్ కు సూచించారు. పై విషయం పై మేనేజర్ మీడియా వివరణ కోరగా మేనేజర్ మాట్లాడుతూ నెల రోజుల్లో ఖాతాదారులందరికీ డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవల బ్యాంకు ఇంటెలిజెంట్ అధికారుల విచారణ పూర్తయిందని, మరొక్కసారి విచారణ చేసి కస్టమర్లకు న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మేనేజర్ వివరించారు.