రెండు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు

by Sridhar Babu |
రెండు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు
X

దిశ,వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వనపర్తి జిల్లాలో రెండు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను నెలకొల్పనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన జిల్లాలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లు ఏర్పాటు పై కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి, కొత్తకోట,పెబ్బేరు పట్టణాలను కలుపుకుంటూ ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆత్మకూరు, అమర్చింత పట్టణాలతో రెండో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా ఏర్పాటు చేసేందుకు కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

మున్సిపల్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ గ్రామాలు, లే అవుట్ లు ఎక్కువగా ఏర్పడి అభివృద్ధి చెందనున్న రెవెన్యూ గ్రామాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో కలపనున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లు ఏర్పాటుకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారి, డీఎల్పీఓ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story