- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు కృషి చేయాలి
దిశ,వనపర్తి : విభిన్న కుల,మత, జాతి వర్గాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాలని, తద్వారా భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు కృషి చేసిన వారమవుతామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. "మిలాద్ ఉన్ నబి" పండుగ సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని మహమ్మదీయ మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్లచందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, అబ్బుభాకర్ బీన్ మహమ్మద్, అబ్బు ఖాసిం, తస్లీమ్, అస్లాబీన్ ఇస్మాయిల్, కౌన్సిలర్లు ఎల్ఐసి కృష్ణ, భాషా, నక్క. రాములు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల. సతీష్, కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల. చంద్రమౌళి, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.