ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలి

by Naveena |
ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు,గ్రామ పంచాయతీని ఫైలెట్ ప్రాజెక్ట్ గా సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో 'కుటుంబ డిజిటల్ కార్డ్ హౌజ్ హోల్డ్' సర్వే కోసం బృందాలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామం,వార్డ్ లో కుటుంబ డిజిటల్ కార్డ్ హౌజ్ హోల్డ్ సర్వే టీమ్ లు కుటుంబ వివరాలు..ఈ నెల 3 నుండి 7 తేదీ వరకు 5 రోజుల పాటు సర్వే నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో హన్వాడ మండలం మాదారం గ్రామం ను,మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో 37 వ వార్డ్ ను,జడ్చర్ల మండలం లోని అల్వాన్ పల్లి గ్రామం,జడ్చర్ల మున్సిపాలిటీ లో 24 వ వార్డ్ ను,దేవరకద్ర నియోజకవర్గంలోని సిసి కుంట మండలం సీతారాం పేట గ్రామం,భూత్పూరు మున్సిపాలిటీ లో 9 వ వార్డ్ ను పైలెట్ గా ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. పైలెట్ సర్వే కు టీమ్ లీడర్లు గా తహశీల్దార్ లు,ఎంపిడిఓ లు,మున్సిపల్ కమిషనర్ లను నియమించమన్నారు. టీమ్ సభ్యులుగా పంచాయతీ రాజ్,రెవెన్యూ,మున్సిపల్ సిబ్బంది ని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. టీమ్ లీడర్ లు,సభ్యులు అందరూ క్షేత్ర స్థాయిలో పకడ్బందీ గా పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన గ్రామం,వార్డ్ లో కుటుంబ వివరాలు సేకరించాలని అన్నారు. ప్రజలు అందుబాటులో ఉండాలని,తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో గ్రామం కు రెండు టీమ్ లు,అర్బన్ లో,మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో 6 టీమ్ లు,జడ్చర్ల పట్టణంలో,దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ లో 4 టీమ్ ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సర్వే కు,ఆశా వర్కర్ లు,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్ లు,ఆర్పీలు అంగన్వాడి టీచర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. కుటుంబ ఫోటో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవాలని,డేటాలో పూర్తి వివరాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు,భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి,డిపిఓ పార్థ సారథి,ఆర్డీఓ నవీన్,మున్సిపల్ కమిషనర్ లు,ఎంపిడిఓ లు,తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed