ఇందిరమ్మ రాజ్యం కావాలా... కమిషన్ల పాలన కావాలా : రేవంత్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-11-21 11:10:21.0  )
ఇందిరమ్మ రాజ్యం కావాలా... కమిషన్ల  పాలన కావాలా  :  రేవంత్ రెడ్డి
X

దిశ,వనపర్తి : ఇందిరమ్మ రాజ్యం కావాలా? కమిషన్ల పాలన కావాలా? తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం తెచ్చి, 60 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, విద్య, వైద్యం సాగునీరు రంగాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసి, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పాఠశాలలలో చదివిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ నాయకులు అడగడం విడ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట్ల కుటుంబం గుడిమెట్ల దగ్గర అడుక్కొని తినేవారని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా దాహార్తిని తీర్చేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును రూపకల్పన చేసి ప్రారంభించే చివరి దశకు చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. 10 శాతం పనులను పూర్తి చేసి మేము చేశామని బీఆర్ఎస్ నాయకులు భుజాలు తడుము కుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, సకల జనుల సమ్మె లో పాల్గొని సాధించుకున్న తెలంగాణను తామే సాధించానని గొప్పలు చెప్పుకుంటున్నాన్నారు. ప్రజలు బీ ఆర్ ఎస్ పార్టీకి ఇచ్చిన పదేళ్ల పాలనలో కుటుంబం బాగు పడింది గాని, ప్రజల బతుకులు బాగుపడలేదని విమర్శించారు. పాలమూరు వలసల జిల్లా నుంచి రాష్ట్ర నాయకత్వ అధ్యక్ష పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని పాలించే అవకాశం కల్పించాలని కోరారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి తూడి మేఘారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Read More..

సీఎం కేసీఆర్ సొంతూరులో గుడి, బడి కట్టించిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed