Harshavardhan Reddy : డీకే అరుణ తన పదవికి రాజీనామా చేయాలి..

by Sumithra |
Harshavardhan Reddy : డీకే అరుణ తన పదవికి రాజీనామా చేయాలి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కానీ, జిల్లాకు కాని ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్థన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరిస్తానని డీకే అరుణ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిందని, పాలమూరు ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు కాని, ఒక్క సమస్యనైనా కూడా పరిష్కరించ లేకపోయిందని అందుకు నైతిక బాధ్యత వహిస్తూ డీకే అరుణ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజధానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందనప్పుడు చప్పట్లు కొడుతూ, బల్లలు చరిచారే తప్ప, పాలమూరు ప్రాజెక్టు పై నోరు విప్పలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఏమీ సాధించలేకపోయారని, ప్రజలు దీన్ని గమనంలో ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed